పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని రూపొందించాలి: చంద్రబాబు

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించాలన్నారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని రూపొందించి నివేదిక సమర్పించాలన్నారు. కేంద్ర బృందాలను రాష్ట్రానికి రప్పించి.. అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల్లో పాల్గొని బాగా పని చేసిన 100 మందిని సత్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్