రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్