AP: అనంతపురం జిల్లా బెలుగుప్ప తండాలోని గౌరుసంద్రం మారెమ్మ జాతర మహోత్సవంలో పూజారి చేసిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ జాతర సందర్భంగా పూజారి ముళ్లకంపల పొదపై పడుకుని విన్యాసాలు ప్రదర్శించారు. ఒంటికి ఎలాంటి రక్తస్రావం కాకుండా జరిగిన ఈ వింత పూజా ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.