కాకినాడ జిల్లాలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

AP: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె.నాయకంపల్లి శివారులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న బండి వరప్రసాద్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. గృహంలో ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారిని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రహస్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పోలీసులు ఈ దాడి చేపట్టినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్