AP: అనంతపురం కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. సేవ్ ఆర్టీడీ (రూరల్ డెవలాప్‌మెంట్ ట్రస్ట్) నినాదాలతో నిరసనకారులు హోరెత్తించారు. జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు ఉండే రెవెన్యూ భవన్‌కు తాళాలు వేశారు. ఈ మేరకు అధికారులతో దళిత సంఘం నేతలు వాగ్వాదానికి దిగారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కి విదేశీ నిధులు ఆపొద్దని డిమాండ్ చేశారు.