AP: ఈ నెల 23 నుంచి ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ మేరకు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సూపర్-6 హమీలను దాదాపు అమలు చేశామని, చేసిన మంచిపని చెప్పుకోవడంలో విఫలం కాకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.