AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు ఎలమంచిలి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంటికి వెళ్తుండగా వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రశ్న రావణ్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రశ్న రావణ్ ఓ వీడియో విడుదల చేశారు. ‘పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? నన్ను పోలీస్ స్టేషన్‌లోనే చంపండి. లేదా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’ అని వీడియోలో పేర్కొన్నారు.