AP: ముస్సోరీలో విశాఖకు చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు భాగంగా రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ముస్సోరీకి బయలుదేరారు. ఈ కేసుకు సంబంధించి తమకు అన్ని విధాలా సహాయం అందించిన మంత్రులు లోకేశ్, అనిత, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చెప్పారు.