నేడు జనసేనలోకి వంగవీటి రాధా!

AP: విజయవాడ మేయర్ సీటు జనసేనకు కేటాయింపు ఖరారు అయినట్లు సమాచారం. దాంతో బలమైన అభ్యర్థిగా వంగవీటి రాధాను భావించి కూటమి తరపున ఆయనను పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇందు కోసం వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉ.10 గంటల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వంగవీటి రాధా జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల విజయవాడ మేయర్ రేసులో రాధా సతీమణి పుష్పవల్లి పేరు కూడా వినిపించింది.

సంబంధిత పోస్ట్

✕
✕