రాధాకు షాక్.. వంగవీటి రంగా విగ్రహం తొలగింపు

AP: తూర్పు గోదావరి జిల్లాలో ఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు విషయంలో టీడీపీ నేతలు అనుమతి నిరాకరించారు. దీంతో ఓపిక నశించిన కాపు యువత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అర్ధరాత్రి కొందరు టీడీపీ సభ్యులు ఆ విగ్రహాన్ని తొలగించారు. శుక్రవారం తిరిగి మరో విగ్రహం ఏర్పాటు చేయగా, పోలీసులు దానిని కూడా తొలగించి, దిమ్మెను పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. దీనిపై కాపులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన రాజకీయంగానూ, సామాజికంగానూ చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕