ఏపీలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభినేని వంశీలు టీడీపీ నేత వంగవీటి రాధా నివాసంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడం రాజకీయంగా ఆసక్తి రేపింది. దీంతో వంగవీటి రాధా తిరిగి మళ్ళీ వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.