AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.