AP: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా తునిలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. దీని ప్రభావం కారణంగా అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షం మొదలైంది. ప్రస్తుతం తునిలో తేలికపాటి వర్షం కురుస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ తుఫాన్ వల్ల తలెత్తే పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.