AP: రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. అల్లూరి జిల్లా, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఇక కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.