కాసేపట్లో పిడుగులతో వర్షం: వాతావరణ శాఖ

కాసేపట్లో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి, నరసన్నపేట ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. పిడుగుల తీవ్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల ప్రజలు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕