రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు: APSDMA

ఏపీకి APSDMA వర్ష సూచన చేసింది. తెలంగాణ, రాయలసీమ, TN ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతాయంది. ఈ మేరకు రేపు SKLM, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

సంబంధిత పోస్ట్