రాబోయే నాలుగు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు!

AP: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీనివల్ల రాబోయే నాలుగు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తాజాగా అంచనా వేసింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉంది.

సంబంధిత పోస్ట్