AP: కొద్దిరోజులుగా రుతుపవన విరామ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగస్టులో ఉత్తరకోస్తా, రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఈ నెల రెండో వారంలో వర్షాలు జోరందుకోవచ్చని అంచనా వేసింది.