AP: మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 48 గంటల్లో మరింత బలపడనుంది. మరోవైపు, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీంతో ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.