ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల పిడుగులు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.