ఏపీలో భారీ వర్షాలు, వాయుగుండం నేపథ్యంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి, పోలవరం, ఏలూరు, వైజాగ్, ఎన్టీఆర్, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు.