ఏపీలో అప్పటిదాకా వర్షాలే!

వర్షాకాలం కావడంతో రుతుపవనాల ప్రభావం.. అలాగే అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. ఏపీలో వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్