మూడు రోజులపాటు కోస్తాంధ్రలో వర్షాలు

AP: కొమొరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు, దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటకపై ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు కోస్తాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕