AP: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి మూర్తి తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.