రానున్న 3 గంటల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

AP: రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నర్సీపట్నం, పాడేరు, బొబ్బిలి, పార్వతీపురం పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడరాదని సూచించింది.

సంబంధిత పోస్ట్