AP: రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (SDMA) అంచనా వేసింది. ముఖ్యంగా నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు పడవచ్చు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.