AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.