కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

AP: కాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సంగం, చేజర్ల, పల్లకొండ, పొదలకూరు, నెల్లూరు, రాపూరు, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕