నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. నేడు (మంగళవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕