నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి (D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్