ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు ఈడీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు విచారణకు సహకరించారని, కేసు ముగింపు దశకు చేరుకుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.