AP: రాజాం నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాలు పార్టీని బలహీనపరుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో విఫలమైన ప్రయోగం, ఇన్ఛార్జ్ తలే రాజేష్‌తో క్యాడర్ అసంతృప్తి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు వర్గంతో ఆధిపత్య పోరు పార్టీని వెంటాడుతున్నాయి. మరోవైపు టీడీపీలో ఐక్యత వైసీపీకి ప్రతికూలంగా మారింది. పార్టీ కార్యకర్తలు అంతర్గత విభేదాలను సరిదిద్దాలని, లేదంటే చరిత్ర పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.