AP: మాజీ మంత్రి విడుదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, విడదల రజిని నియోజకవర్గాన్ని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు. అక్కడ ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. తిరిగి మళ్లీ ఆమె చిలకలూరిపేట వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెను రేపల్లె నియోజకవర్గానికి వెళ్లమని ఆదేశించారట. అయితే, దానికి రజిని నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.