AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు వచ్చారు. అప్పటినుంచి ఆమెకు అన్నీ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఓ వైపు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులను ఫేస్ చేస్తున్న ఆమె.. మరోవైపు కేసులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్, తన పీఏలపై కూడా అలిగేషన్స్ ఎక్కువయ్యాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కుటుంబం కూడా రెండుగా విడిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.