వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం లక్ష్యంగా పుల్లారావు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనది పురుషోత్తపట్నం అని గుర్తు పెట్టుకోవాలని.. ఎవర్నీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తన పార్టీ.. కుటుంబం జోలికి వస్తే వదలనని ఎమ్మెల్యేను హెచ్చరించారు. చిలకలూరిపేటలో రజినిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు విషయంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.