వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి?

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌కు బలం లేనందున, ఆమెను తెలంగాణ లేదా కర్ణాటక కోటాలో పార్లమెంటుకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో తెలంగాణలో తన పార్టీని విలీనం చేసి, ఏపీలో బాధ్యతలు స్వీకరించినందుకు ప్రతిఫలంగా ఆమెకు ఈ పదవి ఇస్తామని హైకమాండ్ అప్పట్లోనే హామీ ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్