AP: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాల బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2014 నుంచే పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న శ్రీరామ్ తాళ్ళూరి, తెలంగాణ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.