AP: రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. సోమవారం సా.5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవ అతిథులుగా పాల్గొంటున్నారు. వివిధ రంగాలకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రముఖులకు ఈ అవార్డు అందించనున్నారు.