బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ’

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం బాలికలకు కరాటే శిక్షణ ఇప్పించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,592 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించనున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలకు ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 2 నెలలపాటు 20 తరగతులను నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్