AP: వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం రుచి వంటి అంశాలపై భక్తుల నుంచి ఏపీ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. ఈ మేరకు పలు ఆలయాలకు ర్యాంకులు ఇచ్చింది. ఇందులో కాణిపాకం ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో శ్రీకాళహస్తి, తృతీయ స్థానంలో ద్వారకా తిరుమల, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలు ఉన్నాయి.