AP: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి పోలీస్ శాఖ తొలగించింది. ఈ మేరకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అత్యాచారం చేశాడని సీఐ చిన్నమల్లయ్యపై ఓ మహిళ ఏప్రిల్ 29న వినుకొండలో ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. అప్పటి నుంచి సీఐ చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.