AP: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. రోజూ బాలికను స్కూలుకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్, తన స్నేహితుడు కలిసి 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. రోజుల తరబడి జరిగిన ఈ లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చింది. మార్చి 28న బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె గర్భవతి అని, నెలలు నిండాయని వైద్యులు తెలిపారు. మార్చి 30న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.