రాప్తాడు ఘటన.. లక్ష్మీని ఫోన్‌లో పరామర్శించిన జగన్

AP:  అనంతపురం జిల్లా రాప్తాడులో నిందితుడు హేమంత్ దాడిలో గాయపడిన విద్యార్థిని లక్ష్మీ‌తో వైసీపీ అధినేత జగన్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యార్థి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గట్టిగా పోరాడవని లక్ష్మీని ప్రశంసించారు. ధైర్యంగా ఉండమని, అందరూ అండగా ఉంటామని విద్యార్థినికి జగన్ చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థిని కుటుంబానికి అండగా ఉండాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕