AP: వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లెలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నిర్వాసిత రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో భూములు అప్పగించిన రైతులకు శాశ్వత ఉపాధి, సరైన నష్టపరిహారం అందిస్తామని ఇచ్చిన హామీలను యాజమాన్యం నెరవేర్చలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చిన కొద్దిమందికి కూడా అరకొర జీతాలు అందిస్తూ, ఇటీవల కనీస సమాచారం లేకుండా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాక్టరీ ప్రధాన గేటును ముట్టడించి ధర్నా చేపట్టారు.