ఏపీ రాజధాని అమరావతిలోని గ్రామాల్లో 2014-19 మధ్య ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులను పునఃపరిశీలించాలని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరికి మినహాయింపులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామకంఠాలను మరోసారి పరిశీలించనున్నారు. అలాగే అమరావతిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కూడా పంపిణీ చేస్తున్నారు.