AP: రాష్ట్రంలో అరటి రైతులకు ఊరట లభించింది. మూడు నెలల క్రితం పడిపోయిన ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అరటి రకం, నాణ్యతను బట్టి రూ.24వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. జీ9 రకం అరటి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సుగంధాలు, అమృతపాణి వంటి రకాలు రూ.20 వేల వరకు అమ్ముడవుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వ్యాపారులు అరటి పంటను కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరగడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.