AP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇప్పుడు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు–2026 ద్వారా గ్రామ గ్రామానికీ, ప్రతి కార్యకర్త హృదయానికీ మహానాడు చేరుతోందని తెలిపారు. మంగళగారి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో పాల్గొన్న ఆమె, మహానేత ఎన్టీఆర్ గారికి నివాళులర్పించారు.