AP: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని, రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. జెండా మోసే కార్యకర్తలే పార్టీకి నిజమైన అధినేతలని, వారిని కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, అక్రమ కేసులకు భయపడేది లేదని, టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్నవారే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు.