నేడు ఏపీలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ఏపీలో భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడు బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా పల్నాడు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం మరియు మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.

సంబంధిత పోస్ట్

✕
✕