AP: పల్నాడు జిల్లాలో బుధవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులకు పరామర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ.."ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. నాగమల్లేశ్వరరావు ఘటనే ఇందుకు నిదర్శనం." అని అన్నారు.